జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్ల విజయం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌–17 బాలుర, బాలికల నెట్‌బాల్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. వివిధ మండలాలు, ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు పోటాపోటీగా తలపడి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో మందమర్రి మండల విద్యాధికారి రాథోడ్ రమేష్ నెట్‌బాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన మ్యాచ్‌లలో క్రీడాకారులు వేగవంతమైన పాసింగ్, సమన్వయం, రక్షణాత్మక ఆటతీరు, గోల్‌...