శ్రావణపల్లి, ఎల్లందు ఓసీ-3 గనులు సింగరేణికే దక్కాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమర్రిలో రాస్తారోకో కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్ (ఓసీ), ఎల్లందు ఓసీ-3 గనులు సింగరేణి సంస్థకే దక్కేలా యాజమాన్యం టెండర్లలో పాల్గొని, గనులను సింగరేణికే కేటాయించే విధంగా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మందమర్రిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మందమర్రి ఏరియా మార్కెట్ ప్రాంతంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్ ప్రసంగించారు. ఈ...