జాతీయ జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణులు
మర్సకోల కవిత, కొట్నాక్ శిరీష రాష్ట్ర జట్టుకు ఎంపిక కోల్ బెల్ట్ న్యూస్ క్రీడాప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణులు మర్సకోల కవిత, కొట్నాక్ శిరీష జాతీయస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోని శ్యాంసుందర్రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, కోశాధికారి అల్గువెల్లి రమేష్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో నిర్వహించిన 48వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రతిభ...