NIGAMA MEDIA (P) LTD
1.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 15, 2026

ఫైనల్‌కు దూసుకెళ్లిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో వరుస విజయాలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న 70వ ఎస్‌జీఎఫ్ (SGF) 17 సంవత్సరాల లోపు బాలబాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ లీగ్ మ్యాచ్‌లలో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

లీగ్ మ్యాచ్‌లలో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు వరంగల్‌పై 10–05 గోల్స్‌తో, నిజామాబాద్‌పై 11–02 గోల్స్‌తో, నల్గొండపై 15–00 గోల్స్‌తో, హైదరాబాద్‌పై 16–02 గోల్స్‌తో ఘన విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకున్న ఆదిలాబాద్ జట్టు కరీంనగర్‌పై 15–03 గోల్స్‌తో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు గోనే శ్యాంసుందర్‌రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, ఒలింపిక్ కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, జిల్లా డీవైఎస్‌ఓ హనుమంతరావు, మంచిర్యాల జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, సీనియర్ పీడీలు రామ్మోహన్‌రావు, రోజీవర కుమారి, బాస్కెట్‌బాల్ కార్యదర్శి సుకుమార ఫ్రాన్సిస్, కోచ్‌లు సుధాకర్, అరవింద్ అభినందించారు.

ఫైనల్ పోటీలోనూ విజయం సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడా పతాకాన్ని ఎగురవేయాలని వారు ఆకాంక్షించారు. క్రీడాకారిణులు ఇదే జోరును కొనసాగించి రాష్ట్రస్థాయి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.