NIGAMA MEDIA (P) LTD
1.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 15, 2026

ఎథిక్ అకాడమీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

చిన్నారుల సృజనాత్మకతకు ‘అవతార్–2026’ వేదిక
ఆకట్టుకున్న ఇతివృత్త ఆధారిత వేషధారణ పోటీ
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, సమాజం పట్ల అవగాహన, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్‌లో ఉన్న ఎథిక్ అకాడమీ – ది ఎలిమెంటరీ స్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అవతార్–2026’ పేరుతో నిర్వహించిన వినూత్న ఇతివృత్త ఆధారిత వేషధారణ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ వేషధారణ పోటీలకు భిన్నంగా, ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకుని, దాని ద్వారా సమాజానికి సందేశాన్ని అందించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను, సృజనాత్మకతను చాటుకున్నారు.

ఈ పోటీలో ప్రత్యేకత ఏమిటంటే.. విద్యార్థులు కేవలం వేషధారణకే పరిమితం కాకుండా, తాము ఎంచుకున్న అంశం వెనుక ఉన్న ఉద్దేశం, దాని ప్రాధాన్యతను వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఈ కార్యక్రమం వినోదంతో పాటు విజ్ఞానం, సామాజిక అవగాహన, నైతిక విలువలను పెంపొందించే వేదికగా నిలిచింది. కార్యక్రమంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా విశేషంగా నిలిచింది. మార్కెట్‌లో లభించే సిద్ధంగా ఉన్న దుస్తులను కొనుగోలు చేయకుండా, పిల్లలు ఎంచుకున్న ఇతివృత్తానికి అనుగుణంగా ఇంటి వద్దే దుస్తులను రూపొందించాలని పాఠశాల ప్రోత్సహించింది. దీంతో తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఆలోచించి, సృజనాత్మకంగా దుస్తులను తయారు చేయడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ ఈ వేడుక ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలకే పరిమితం కాకూడదని, విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతతో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల్లోని అంతర్గత ప్రతిభను వెలికితీయడంతో పాటు, తమ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తల్లిదండ్రులను అభినందిస్తూ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కృషిని ప్రశంసించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. చిన్నారుల సృజనాత్మకత, భావవ్యక్తీకరణ, సాంస్కృతిక అవగాహన, సామాజిక స్పృహను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ‘అవతార్–2026’ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.