ఆలస్యంగా అందిన సింగరేణి పెన్షన్లు

యూనియన్ బ్యాంకు ఖాతాల్లో జమ అసోసియేషన్ నాయకులకు రిటైర్మెంట్ కార్మికుల కృతజ్ఞతలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి డివిజన్‌లోని సింగరేణి విశ్రాంత కార్మికులకు నవంబర్ నెల పెన్షన్ల చెల్లింపులో జాప్యం జరగడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి నెలా ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన పెన్షన్ ఈసారి స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే పంపించి, యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు పంపించకపోవడంతో రిటైర్మెంట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పండుగ ఖర్చులకు పెన్షన్ అందుతుందో లేదోనని...