పెన్షనర్ల కోసం జీవన్ ప్రమాణ్ ప్రత్యేక క్యాంపు ప్రారంభం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి మాజీ ఉద్యోగులు (పెన్షనర్లు) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం, సీఎంపీఎఫ్ కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) పునరుద్ధరణ, అవగాహన ప్రత్యేక క్యాంపును సోమవారం మందమర్రి సీఈఆర్ క్లబ్లో ఘనంగా ప్రారంభించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ క్యాంపును ప్రారంభించారు. ఈ...