ప్రకృతిమిత్రకు రూ.26 వేల విలువైన సౌండ్ సిస్టం విరాళం
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ మంచిర్యాల జిల్లాకు చెందిన అగ్నిమాపక శాఖ అధికారి, ప్రకృతి ప్రేమికుడు మామిడి భగవాన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రకృతిమిత్ర కార్యక్రమాలకు ఆకర్షితులైన ఆయన, తన భార్య పద్మతో కలిసి రూ.26 వేల విలువైన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అహుజా సౌండ్ సిస్టంను విరాళంగా అందజేశారు. మంచిర్యాలలోని ఎం. కన్వెన్షన్లో భగవాన్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల...