NIGAMA MEDIA (P) LTD
7.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 13, 2026

కాసిపేట గురుకుల పాఠశాలను హైస్కూల్‌లోనే ఏర్పాటు చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

గుండ్లపహాడ్ వద్ద భవనాల నిర్మాణంపై అభ్యంతరం.. ప్రభుత్వానికి పలువురి డిమాండ్

కాసిపేట, కోల్ బెల్ట్ న్యూస్:

కాసిపేట మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను స్థానికంగానే ఏర్పాటు చేయాలని, ఇతర ప్రాంతాలకు తరలించవద్దని పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాసిపేట మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను బెల్లంపల్లికి తరలించి, గత ఐదేళ్లుగా ప్రైవేట్ భవనంలో అద్దె చెల్లిస్తూ నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. పాఠశాలను తిరిగి కాసిపేటకు తీసుకురావాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు గతంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల గురుకుల పాఠశాల భవనాలను కాసిపేటకు సమీపంలోని గుండ్లపహాడ్ వద్ద నిర్మించేందుకు పనులు ప్రారంభించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్మాణం కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసే బదులు, కాసిపేటలోని ప్రభుత్వ హైస్కూల్‌లోనే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

హైస్కూల్ భవనాలను వినియోగించుకోవాలి

కాసిపేట ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో భవిష్యత్తులో పాఠశాల మూతపడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే అక్కడ ఉన్న తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర సౌకర్యాలు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న హైస్కూల్ భవనాలు, మైదానాన్ని గురుకుల పాఠశాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు గదులు నిర్మిస్తే సరిపోతుందని, దీనివల్ల ప్రభుత్వానికి నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు నిధులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. మిగిలిన నిధులను మండల అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని సూచించారు.

గుండ్లపహాడ్ వద్ద పాఠశాల నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజాధనం వృథా అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ అంశాన్ని పునఃపరిశీలించి, కాసిపేట ప్రభుత్వ హైస్కూల్‌లోనే గురుకుల పాఠశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, కొడప అనంతరావు, ఆదివాసీ నాయకుడు రాయిసెంటర్ మేటి, సామాజిక కార్యకర్త సిరాజ్ ఖాన్, వార్డు సభ్యుడు నిచ్చకొల్ల శంకర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల ఇన్‌చార్జి సోదారి సురేష్, కాంగ్రెస్ యువజన నాయకుడు భూక్యా తిరుపతి నాయక్, బన్న రాములు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.