కాసిపేట గురుకుల పాఠశాలను హైస్కూల్‌లోనే ఏర్పాటు చేయాలి
గుండ్లపహాడ్ వద్ద భవనాల నిర్మాణంపై అభ్యంతరం.. ప్రభుత్వానికి పలువురి డిమాండ్ కాసిపేట, కోల్ బెల్ట్ న్యూస్: కాసిపేట మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను స్థానికంగానే ఏర్పాటు చేయాలని, ఇతర ప్రాంతాలకు తరలించవద్దని పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాసిపేట మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను బెల్లంపల్లికి తరలించి, గత ఐదేళ్లుగా ప్రైవేట్ భవనంలో అద్దె చెల్లిస్తూ నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. పాఠశాలను తిరిగి కాసిపేటకు తీసుకురావాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు గతంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల...