NIGAMA MEDIA (P) LTD
11.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 6, 2026

సింగరేణి సమస్యల పరిష్కారానికి కవిత ధర్నా

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించాలి
లేకుంటే నిరాహార దీక్ష: కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సోమవారం లక్‌డీకాపూల్‌లోని సింగరేణి భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ నాయకులతో కలిసి కవిత బైఠాయించి సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని కోరారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేయడంతో పాటు నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని అన్నారు. కార్మికుల అలియాస్ నేమ్స్ (మారుపేర్లు) సమస్యను పరిష్కరించాలని, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ పేరుతో నిలిపివేసిన డిపెండెంట్ల ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రతి సింగరేణి కార్మికుడికి సొంత ఇంటి పథకం కోసం రెండు గుంటల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించాలని, సింగరేణి కార్మికులపై ఆదాయపు పన్ను భారాన్ని రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం సింగరేణికి బకాయి పడిన రూ.62 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయ మేనేజర్ భాస్కర్ కవితతో చర్చించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో కవిత ధర్నాను విరమించారు. అయితే రెండు నెలల్లోగా సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని ఆమె ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.