NIGAMA MEDIA (P) LTD
15.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 3, 2026

ఘనంగా జిల్లా స్థాయి ఆట్యా పాట్యా ఎంపిక పోటీలు ప్రారంభం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

క్రీడలతో నాయకత్వ లక్షణాల పెంపు
క్రీడా సర్టిఫికెట్లతో విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్,

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

జైపూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో శుక్రవారం మంచిర్యాల జిల్లా సీనియర్ మహిళలు, పురుషుల ఆట్యా పాట్యా ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, సోషల్ వెల్ఫేర్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రజినీకాంత్ హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగాల్లో లభించే క్రీడా రిజర్వేషన్లకు క్రీడా సర్టిఫికెట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలు వ్యక్తుల్లో క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. జైపూర్‌లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఆట్యా పాట్యా ఎంపిక పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించి జిల్లా జట్టుకు ఎంపిక కావాలని వారు కోరారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జగిత్యాల జిల్లా కోరుట్లలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు తరఫున పాల్గొని విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో కూడిన జిల్లా జట్లను జిల్లా ఇన్‌చార్జి సెక్రటరీ సంతోష్ ప్రకటించారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 90 మంది మహిళలు, పురుషులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆట్యా పాట్యా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సంతోష్, జాయింట్ సెక్రటరీ వర్ష, బాక్సింగ్ కార్యదర్శి దేవేందర్, పీడీ సాయి, పీఈటీలు మహేష్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.