NIGAMA MEDIA (P) LTD
16.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 3, 2026

బీబీపేటలో వాడివేడిగా గ్రామసభ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

దెబ్బతిన్న బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించాలి..
శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో గ్రామ అభివృద్ధి అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో గత ఏడాది బ్రిడ్జి దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. దెబ్బతిన్న బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని అన్ని పార్టీలకు చెందిన నాయకులు, సభ్యులు, గ్రామస్థులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింహులు మాట్లాడుతూ గ్రామంలో చిన్నచిన్న పనులకు మాత్రమే పరిమితం కాకుండా, దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. బ్రిడ్జి సమస్యతో పాటు గ్రామంలోని ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామానికి జరిగిన అభివృద్ధి పనులపై కూడా ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని తెలిపారు. గ్రామసభలో అభివృద్ధి పనులపై కొంతసేపు వాడివేడిగా చర్చ జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఏదైనా అభివృద్ధి పనిపై తీర్మానం చేసిన అనంతరం దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, ఆచరణలోకి తీసుకురావాలని ప్రజాప్రతినిధులను కోరారు.

బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు అందకపోతే గ్రామస్థులంతా ఏకమై అవసరమైన సహకారం అందించి, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని నర్సింహులు సూచించారు. అవసరమైతే గ్రామస్థుల సహకారంతో డీసీఎంలలో వెళ్లి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, మాజీ సర్పంచ్ భూమ గౌడ్, తాజా సర్పంచ్ సత్యనారాయణ, ఉమ్మడి సర్పంచ్ గాడ్లింగం సుతార్ రమేష్, మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త నర్సింహులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.