NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

తెలంగాణ విమోచన పోరాటంలో సంపత్ లాల్ సమరం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

తెలంగాణ విమోచన పోరాటంలో సంపత్‌లాల్‌ సిసోడియా కుటుంబం పాత్ర
తండ్రి బాటలోనే నలుగురు తనయులు
రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రజనీష్ జైన్

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

దేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌ సంస్థాన పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలన, రజాకార్ల చర్యలకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా లక్షేటిపేట వేదికయినది. ఈ పోరాటంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సంపత్‌లాల్‌ సిసోడియా ఈ ప్రాంతం నుంచి ప్రధాన పాత్ర పోషించి నిజాం ప్రభుత్వ నిర్బంధంలో జైలులో ఉన్నారని, అయన నడిచిన కాషాయం నీడలో నడిచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ వివరించారు.

మరో ముగ్గురు మున్నా రాజ్‌, రమేష్‌, నరేష్‌ కూడా తండ్రి నడిచిన కాషాయం బాటలోనే నడవటం విశేషం. వాస్తవానికి ఓకే కుటుంబలో ఉన్న సోదరులు వారి అవసరాలకు తగ్గట్టుగా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కొనసాతున్న పలు సందర్భాలను చూస్తూనే ఉన్నాం. కానీ అధికారం కోసం, పలుకుబడి కోసం ఆశించకుండా తండ్రి ఎంచుకున్న మార్గాన్ని మరువక పోవడం విశేషం. నలుగురిలో ఒకరు రాష్ట్ర స్థాయిలో భాద్యల్లో ఉండగా, మున్నారాజ్ కూడా బీజేపీ రాష్ట్ర కమిటీలో భాద్యతలు నిర్వహిస్తున్నారు. మిగతా ఇద్దరు జిల్లా స్థాయిలో కొనసాగుతున్నారు.

ఈ సందర్బంగా రజనీష్ జైన్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటం, స్వాతంత్య్ర పోరాటంలో తన తండ్రి సంపత్ లాల్ కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ తల్లి నలుగురు అన్నదమ్ములను, ముగ్గురు అక్కచెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించిందని తెలిపారు. తండ్రి పిల్లలకు దూరంగా ఉన్నప్పటికీ అనేక కష్టాలకు తట్టుకొని మాకు ఇబ్బందులు రాకుండా చూసుకుందంటూ గతాన్ని గుర్తుకు చేసుకున్నారు.
1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీసిన ‘ఆపరేషన్‌ పోలో’ అనంతరం తన తండ్రి జైలు నుంచి విడుదలయ్యారని ఆయన ఈ సందర్బంగా వివరించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడైన తన తండ్రి పోరాటాన్ని స్మరించుకుంటున్నట్లు రజనీష్‌ జైన్‌ పేర్కొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.