(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘ఆస్మాన్’ నుంచి మేకర్స్ తాజాగా టీజర్ (గ్లింప్స్)ను విడుదల చేశారు. దర్శకుడు రామ్ నందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉండగా.. విడుదలైన గ్లింప్స్ ద్వారా చిత్ర కథాంశం, కాన్సెప్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
బుధవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శ్రీహరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మేఘాంశ్ తనకు తమ్ముడిలాంటి వాడని పేర్కొన్న మనోజ్.. ‘ఆస్మాన్’ సినిమాతో అతడు మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీ క్లీంకారా సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు.. దర్శకుడు రామ్ నందన్ ఎలాంటి కథ, కాన్సెప్ట్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారనే విషయంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.