రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ’ బయోపిక్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గానకోకిల ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సుబ్బులక్ష్మి పాత్రను ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న పోషించనున్నారు. ‘ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. సెప్టెంబర్ 16న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు....