కవిత హామీల్లో కేసీఆర్ పాత ఫార్ములా!
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్వకుంట్ల కవిత ప్రకటిస్తున్న తాజా రాజకీయ కార్యాచరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన వేదికగా ఆమె ప్రకటిస్తున్న హామీలు, విమర్శల తీరు గతంలో కేసీఆర్ అనుసరించిన రాజకీయ ఫార్ములానే గుర్తు చేస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ‘భూ లక్ష్మి’ పథకం కింద ఎకరం భూమి ఇస్తామని కవిత ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ...