NIGAMA MEDIA (P) LTD
15.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 3, 2026

బెల్లంపల్లిలో దోమల ఫాగింగ్ చేపట్టాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్

కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి):

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలోని 34 మున్సిపల్‌ వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున పట్టణంలోని అన్ని వార్డుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లోరినేషన్, దోమల మందు ఫాగింగ్ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు. ఫాగింగ్‌ నిర్వహించకపోవడం వల్ల దోమల బెడద పెరిగి ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టణంలోని మురుగు కాలువలను శుభ్రం చేసి, మోరీలను ఎప్పటికప్పుడు తీర్చాలని సూచించారు.

తినుబండారాల బండ్లపై తనిఖీలు చేపట్టాలి

బెల్లంపల్లి పట్టణంలో ఎక్కడపడితే అక్కడ తినుబండారాల బండ్లు ఏర్పాటు చేసి, సరైన పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని వెంకటేష్ ఆరోపించారు. అనేక బండ్లపై దోమతెరలు లేకపోవడంతో ఆహార పదార్థాలపై దుమ్ము, దోమలు వాలే అవకాశం ఉందన్నారు. సంబంధిత అధికారులు తినుబండారాల బండ్లను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడంతో కొందరు కల్తీ నూనెలు, నాణ్యత లేని పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో బ్లీచింగ్, క్లోరినేషన్, దోమల ఫాగింగ్‌ కార్యక్రమాలను తక్షణమే చేపట్టడంతో పాటు, కల్తీ పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి విక్రయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ తరఫున పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.