బెల్లంపల్లిలో దోమల ఫాగింగ్ చేపట్టాలి
ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలోని 34 మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున పట్టణంలోని అన్ని వార్డుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లోరినేషన్, దోమల మందు ఫాగింగ్ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని...