35.5 C
Munich
Tuesday, August 4, 2026

మందమర్రిలో పింఛన్ల ఫీల్డ్ వెరిఫికేషన్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మున్సిపల్ సేవల అమలుపై ప్రత్యక్ష పరిశీలన
డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ సమీక్ష

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పింఛన్ల పంపిణీ, లైవ్ ఐడెంటిఫికేషన్, మరణాల నమోదు, కొత్త చేయూత పింఛన్ల మంజూరు కోసం అర్హత నిర్ధారణకు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ పనులను శిక్షణ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో జరుగుతున్న క్షేత్రస్థాయి ధృవీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఫీల్డ్ వెరిఫికేషన్‌ను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అమలవుతున్న హరితహారం, వన మహోత్సవం, పారిశుద్ధ్య నిర్వహణ, ఫాగింగ్ కార్యక్రమాలు తదితర మున్సిపల్ సేవల అమలును కూడా సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందేలా అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా, వేగవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, డి. అన్నాజీ, డి.ఆర్.డి.ఏ. మంచిర్యాలకు చెందిన డి.పి.ఎం. (పింఛన్లు), పింఛన్ల విభాగం సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బొల్లు శ్యాంబాబు, సంబంధిత వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.