19.4 C
Munich
Sunday, August 2, 2026

మందమర్రి ఏరియా గనుల్లో 106 % ఉత్పత్తి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

అపరిష్కృత సమస్యల పరిస్కారం
రక్షణతో కూడిన ఉత్పత్తి
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఏరియా సింగరేణి బొగ్గు గనులు106% బొగ్గు ఉత్పత్తి సాధించగా, 105% ఓవర్ బర్ధన్ తొలగింపు లక్ష్యాన్ని సాధించామని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై మాసంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మిక సంక్షేమ కార్యక్రమాల వివరాలను వివరించారు.

జూలైలో ఏరియాలోని కె కె – 5 , కె కె ఓ సి గనులు 100% ఉత్పత్తిని సాధించాయన్నారు. ఈ ఉత్పత్తి సాధనలో కృషి చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి, సూపర్వైజర్లకు, అధికారులకు జి యం రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అండర్ గ్రౌండ్ గనులలో ఉద్యోగుల గైరాజరు వలన ఉత్పత్తికి కొంత నష్టం కలిగిందంటూ విచారo వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి కార్మికులతో పాటు యూనియన్ నాయకులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఉద్యోగులు, అధికారుల సహాయ సహకారాలతో అండర్ గ్రౌండ్ గనులలో 100% ఉత్పత్తి సాధించేలా, ప్రతి ఒక్కరూ రక్షణ, నాణ్యత తో కూడిన ఉత్పత్తిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
​    ప్రతి నెలా వెల్ఫేర్, పర్సనల్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తు ఏరియాలో సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో కాలనీల్లో పలు సమస్యలు ఎదురైనప్పటికి, సంబంధిత సిబ్బంది స్పందించి పరిష్కరించామన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఇంజనీర్ ( ఈ & యం ) బాలాజీ భగవతీ జా, డి జి యం (పర్సనల్) అశోక్, డి జి యం ( ఐ ఈ డి ) కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.