NIGAMA MEDIA (P) LTD
15.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

రాజకీయాలపై లారెన్స్ సస్పెన్స్……

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నిర్ణయం అభిమానులకే వదిలిన నటుడు
లారెన్స్ పోటీపై తమిళనాడులో చర్చ

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల) :

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, డ్యాన్స్ మాస్టర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నటుడు విజయ్ ఖాళీ చేసిన రాజకీయ స్థానం నుంచి ఎమ్మెల్యేగా లారెన్స్ పోటీ చేసే అవకాశాలపై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు ఈ అంశంపై స్పష్టత ఇవ్వని లారెన్స్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే రాజకీయాల్లోకి వస్తానా? రానా? అనే నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించకుండా అభిమానుల అభిప్రాయానికే వదిలేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

“నేను ఏం నిర్ణయం తీసుకోవాలో మీరే చెప్పండి. మీరు రమ్మంటే రాజకీయాల్లోకి వస్తాను. లేదంటే లేదు. ఇప్పటిలాగే నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను” అని లారెన్స్ పేర్కొన్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఉన్న ఊహాగానాలు మరింత పెరిగాయి.

అంతేకాకుండా తన జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర కథను కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాలు అందుకు ఒక మార్గమైతే ఆ దిశగా ఆలోచిస్తాననే సంకేతాలను ఆయన ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

లారెన్స్‌కు సినీ రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా విశేష ఆదరణ ఉంది. అనాథలు, వికలాంగులు, పేద విద్యార్థులకు ఆయన అందిస్తున్న సహాయం కారణంగా సామాజిక సేవకుడిగానూ గుర్తింపు పొందారు. అందుకే రాజకీయాల్లోకి వస్తే ప్రజల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం లారెన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రాజకీయాల్లోకి రావాలని కోరుతుండగా, మరికొందరు సేవా కార్యక్రమాలనే కొనసాగించాలని సూచిస్తున్నారు. అభిమానుల స్పందన ఆధారంగా లారెన్స్ భవిష్యత్ రాజకీయ నిర్ణయం ఉండే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.