19.9 C
Munich
Sunday, July 26, 2026

మంచిర్యాల జిల్లాలో CPM కు ఎదురుదెబ్బ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మంచిర్యాలలో సీపీఎం నాయకుల మూకుమ్మడిగా రాజీనామా
రాష్ట్ర నాయకత్వంపై ఆరోపణలు
రాజీనామా చేసిన నాయకులతో కొత్త పార్టీ ఏర్పాటు

కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) :

కొంతమంది CPM రాష్ట్ర నాయకుల గ్రూపు రాజకీయాలు, ముఠా ధోరణులు, వ్యక్తిగత పోకడల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు గురువారం CPMకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీకి పంపినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్బంగా రాజీనామా చేసిన నాయకులు మాట్లాడుతూ….

దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకుడితో పాటు పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు పార్టీని వీడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర నాయకత్వం తమ ఆధిపత్యం కోసం జిల్లాలో గ్రూపులను ప్రోత్సహించిందని, తప్పులను ప్రశ్నించిన నాయకులను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు జరిగాయని వారు ఆరోపించారు.

నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదని, పార్టీ నిర్మాణ సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. మతోన్మాద శక్తులను ఎదుర్కోవాలని మాటల్లో చెబుతూ, ఆచరణలో మాత్రం అలాంటి శక్తులు బలపడే విధంగా వ్యవహరిస్తున్నారని రాజీనామా చేసిన నాయకులు ఈ సందర్బంగా విమర్శించారు.

నాయకత్వంలో కమ్యూనిస్టు విలువలు క్షీణించాయని, దీనివల్ల పార్టీ కింది స్థాయి వరకు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శుల దృష్టికి ఈ అంశాలను పదేపదే తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో పార్టీతో పాటు ప్రజా సంఘాల బాధ్యతల నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

రాజీనామా చేసిన నాయకులు:
సంకె రవి – CPM జిల్లా కార్యదర్శి
దూలం శ్రీనివాస్ – CPM జిల్లా కమిటీ సభ్యుడు
దాసరి రాజేశ్వరి – CPM జిల్లా మాజీ కార్యదర్శివర్గ సభ్యురాలు
బోండ్ల సరిత – చెన్నూర్ కార్యదర్శి
గట్టు మహేందర్ – మంచిర్యాల టౌన్ కార్యదర్శి
ఎ. అభినవ్ – నస్పూర్
బోయిరే రమాదేవి – చెన్నూర్
జునగరి అశ్విని

పార్టీ అంతర్గత వ్యవహారాలపై చేసిన ఈ ఆరోపణలు జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. CPM రాష్ట్ర నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.