24.4 C
Munich
Sunday, July 26, 2026

నేల రాలిన మావోయిస్టు మూల స్థంభం హిడ్మ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బలగాలకు కొరకరాని కొయ్య
30కి పైగా ప్రధాన దాడులకు వ్యూహకర్త
రూ : 6 కోట్ల రివార్డు
హిడ్మతో పాటు అతని భార్య రాజక్క మృతి
ఏపీ లో జరిగిన ఎదురుకాల్పులు
హిడ్మ తోపాటు మరో ఐదుగురు మృతి

Mavoist : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు,గెరిల్లా ఆర్మీ కమాండర్ మడావి హిడ్మ ఉన్నాడని పోలీస్ అధికారులు ప్రకటించారు. అతనితో పాటు అతని భార్య రాజక్క ఉంది.

హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన స్థానిక మూరియా తెగకు చెందిన వ్యక్తి. చదివింది ఏడోతరగతి. 17 ఏళ్లకే అడవిబాట. గెరిల్లా, ఆర్మీ, బస్తర్, దంతెవాడ ,పరిశోధన, పార్టీ నిర్మాణం, అభివృద్ధి, ఆయుధ విభాగాలకు భాద్యత వహిస్తూనే కేంద్ర కమిటీ సభ్యుడిగా అతిచిన్న వయసులో ఎంపికయ్యాడు. పోలీస్ బలగాలకు కొరకరాని కొయ్యగా తయారైనాడు. 30 కి పైగా ప్రధాన దాడులకు వ్యూహకర్తగా పనిచేసి 200 కు పైగా పోలిసుల మృతికి ప్రధాన కారకుడయ్యాడు. హిడ్మా పై వివిధ రాష్ట్రాల్లో కలిపి రూ : కోట్ల రివార్డ్ ఉంది.

30 ఏళ్ల పాటు పోలీస్ బలగాలకు చిక్కినట్టే చిక్కి కంటిమీద కునుకు లేకుండా చేసాడు. సుమారు ఆరు భాషల్లో ప్రావీణ్యం. గెరిల్లా, ఆర్మీ దాడులు నిర్వహించడంలో సిద్ధహస్తుడు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఏకైక మావోయిస్టు హిడ్మా. కేంద్ర కమిటీకి ఎంపికయిన వారిలో అతి చిన్న వయసు ఉన్న హిడ్మా. పార్టీలో పరిశోధన, అభివృద్ధి విభాగం ఇతడి కనుసన్నల్లోనే నడుస్తుందని సమాచారం. దేశీయ ఆయుధాలు, ఐఈడి బాంబులు, బూబీ ట్రాఫ్ లను తయారు చేయడంలో హిడ్మా సిద్ధహస్తుడు. మావోయిస్టు పార్టీ 2006 లో బెటాలియన్లను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి హిడ్మా నే బెటాలియన్లకు భాద్యత వహిస్తున్నాడు.

కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో ఉంటూనే గెరిల్లా, ఆర్మీ, బెటాలియన్లకు భాద్యత వహిస్తున్న హిడ్మా పార్టీని ముందుండి నడిపిస్తాడని పార్టీ కేంద్ర కమిటీ భావించింది. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో పార్టీ కుంగిపోతున్న దశలో పార్టీకి మూల స్థంభమైన హిడ్మా నేల రాలడం కోలుకోలేని దెబ్బ.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.