NIGAMA MEDIA (P) LTD
16.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

BRS : బిఆర్ఎస్ …..టిఆర్ఎస్ అవుతుందా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BRS : అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ నేతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినా సర్దుకుపోయారు. తరువాత కంటోన్మెంట్. ఆ తరువాత జూబ్లీ హిల్స్ . వరుసగా ఎదురు దెబ్బ తగిలింది. దింతో గులాబీ శ్రేణులు తల్లడిల్లిపోతున్నారు. రెండు ఎన్నికల్లో కూడా సానుభూతి పనిచేయలేదు. అధికార పార్టీ ఎలా గెలిచింది అనేది ఇక్కడ అనవసరం. కానీ రెండు సిట్టింగ్ స్థానాలను మాత్రం కోల్పోయి గులాబీ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది.

జూబ్లీహిల్స్ ఓటమి అనంతరం గులాబీ శ్రేణుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. వరుస ఓటమి పార్టీలో నిరాశకు గురిచేసింది. తెలంగాణ సెంటిమెంట్ తగ్గడం, పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకపోవడం కూడా వరుస ఓటమికి కొంత కారణం అనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని తొలగించి, భారత రాష్ట్ర సమితి గా మార్చడంతోనే ప్రజలు దూరం పెట్టినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది.

టిఆర్ఎస్ ….బిఆర్ఎస్ గా మారిపోయి ఇప్పుడు విఆర్ఎస్ తీసుకోవడమే మిగిలిపోయిందని పలు పార్టీలనాయకులు సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియా లో. అధినేత కేసీఆర్ కు పంచాంగం, వేదం, వాస్తు పై అపారమైన నమ్మకం. అందుకే ఇప్పుడు పార్టీ పేరు మార్చడంపై గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సాధన కోసం తెలంగాణ పేరుతో కలిపి పార్టీకి పేరు పెట్టారు కేసీఆర్.

2023 ఎన్నికలకు ముందు పార్టీ పేరు మార్చారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు. ఉద్యమ నేతగా, పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న తానూ దేశంలో కీలకనేతగా మారి చక్రం తిప్పుతానంటూ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ఆ విధంగా బిఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో పేరు, ప్రతిష్టలు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటే దేశ ప్రజలకు దగ్గర కాలేమనే ఉద్దేశంతోనే పార్టీ పేరు మార్చారు. తెలంగాణకు అనుకొని ఉన్న పలు పొరుగు రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.

ఈ విదంగా దేశ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ కలలో కూడా ఊహించని ఫలితాన్ని రాష్ట్రంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ గద్దెపై గురిపెట్టిన కేసీఆర్ ఆశలు అక్కడ, ఇక్కడ అడియాశలే అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వరుస ఓటమి వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం కొనసాగుతోంది. పార్టీ పేరు మార్చిన నాటి నుంచే అపజయం మూటగట్టుకున్నాం. తిరిగి పార్టీ పేరు మార్చితేనే మంచి రోజులు వస్తాయంటున్నారు గులాబీ శ్రేణులు. ఇదే విషయంపై కూడా పార్టీ పెద్దలు పలువురు అధినేత దృష్టికి తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.