22 C
Munich
Monday, July 27, 2026

Encounter : ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మృతుడు బాలకృష్ణ వరంగల్ జిల్లా నివాసి
బాలకృష్ణ పై రూ : కోటి రివార్డు
30 ఏళ్లకు పైగా అడవి బాటలోనే

Encounter : మావోయిస్టు పార్టీ ఒకవైపు ఎదురు కాల్పులు, మరోవైపు లొంగుబాటుతో సతమతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది సాధించే దిశలో ముందుకు సాగుతోంది. చర్చలకు కూడా మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడంలేదు. లొంగుబాటుకు అవకాశం ఇచ్చినప్పటికీ మావోయిస్టు పార్టీ యుద్ధానికే సన్నద్ధం అన్నటుగా అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ తో పాటు మరో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నిఖిల్ రఖేచా ధృవీకరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలుదిహి అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా భద్రతా సిబ్బంది మావోయిస్టులతో ముఖాముఖి ఎదురుకాల్పులు జరిగినట్టుగా జిల్లా ఎస్పీ నిఖిల్ రఖేచా ప్రకటించారు

మోడెం బాలకృష్ణను మనోజ్, భాస్కర్, బాలన్న, రామచంద్ర వంటి పేర్లతో పార్టీలో కొనసాగుతున్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నివాసి. మూడు దశాబ్దాలుగా పార్టీలో వివిధ హోదాలో భాద్యతలు నిర్వహించారు. 58 ఏళ్ల బాలకృష్ణ కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. దాడులను నిర్వహించడంతోపాటు రెడ్ కారిడార్ అంతటా తిరుగుబాటును విస్తరించడంలో కీలక పాత్ర పోషించాడనే పేరుంది. ఇతనిపై కోటి రూపాయల రివార్డు సైతం ఉంది.

ఒకవైపు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే మరోవైపు ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల భాద్యతలను కూడా అదనంగా బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ మృతి పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. గరియాబంద్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (CoBRA)లతో కూడిన ఉన్నత విభాగాలు ఉమ్మడిగా అడవుల్లో గాలింపు చేపట్టగా మావోయిస్టులు ఎదురుపడినట్టుగా అక్కడి ఎస్పీ ప్రకటించారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.