NIGAMA MEDIA (P) LTD
14.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 1, 2026

మందమర్రి మండలంలో ప్రజావాణి.. 7 పిటిషన్లు స్వీకరణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం మందమర్రి మండలంలో నోడల్‌ ఆఫీసర్‌ రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖలకు చెందిన 24 క్షేత్రస్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 7 పిటిషన్లు స్వీకరించారు. ఇందులో 2 పిటిషన్లు మందమర్రి మున్సిపల్‌ కమిషనర్‌ పరిధికి, మరో 5 పిటిషన్లు మందమర్రి తహసీల్దార్‌ కార్యాలయ పరిధికి సంబంధించినవిగా అధికారులు తెలిపారు.

ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నోడల్‌ ఆఫీసర్‌ రాజేశ్వర్‌ సూచించారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.