19.9 C
Munich
Sunday, July 26, 2026

Politics : బిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం ? ఎంతవరకు నిజం ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Politics : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రోజుకో విధంగా వినబడుతున్నాయి. బీజేపీలో బిఆర్ఎస్ విలీనమవుతుందని ఒక పార్టీ నాయకుడు అంటారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో ఏర్పడిన కూటమి తెలంగాణలో పోటీచేస్తుంది. కాబట్టి కేసీఆర్ తన పార్టీని బీజేపీ లో విలీనం చేస్తారని కొందరు నాయకులు అంటారు. ఢిల్లీ లో ఉన్న బీజేపీ పెద్ద నాయకులే వాళ్లకు చెవిలో చెప్పినట్టుగా మాట్లాడుతారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ప్రముఖ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమంటూ ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రభాకర్ కు ఢిల్లీ లో ఉన్న ప్రముఖ కాంగ్రెస్ నేతల్లో ఎవరో ఒకరు ఆయనకు చెప్పినట్టుగా మాట్లాడారు.

ఒకవేళ వాస్తవానికి కాంగ్రెస్ లో గులాబీ పార్టీ విలీనం అవుతుంది అనుకుంటే… వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎందుకు దుమ్మెత్తి పోస్తారు అనేది రాజకీయ వర్గాల ప్రశ్న. తాజాగా కేటీఆర్ కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్లి వివరించండి అంటూ కార్యకర్తలకు ఎందుకు పిలుపునిస్తారు అనేది కూడ ఒక ప్రశ్న. రాష్ట్రము ఏర్పాటు చేస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అంటూ కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆచరణలో పెట్టలేదు. విలీనం చేస్తే అప్పుడే కేసీఆర్ కు కాంగ్రెస్ లో సరైన గౌరవం, సముచిత స్తానం కూడా దక్కేది.

దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. బీజేపీ బలంగా తయారైనది. రాష్ట్రంలో ఇటీవల వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి కేసీఆర్ కు ఎంతో కొంత ఉపశమనం కలగాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లో విలీనం అవుతారు. కానీ కాంగ్రెస్ లో విలీనం అయితే కేసీఆర్ కు దక్కే ఫలితం ఏమిటని కూడా రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ తన కూతురు కవిత లిక్కర్ కేసు విషయంలోనే కొట్టుమిట్టాడుతున్నారు.

అసలే రేవంత్ రెడ్డి , కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ లోకి వస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఎంతవరకు ఒప్పుకుంటారనేది కూడా అనుమానమే అంటున్నారు రాజకీయ పండితులు. ఒకవేళ అదే నిజమైతే రేవంత్ రెడ్డి కూడా తనదారి తానూ చూసుకోవడం కూడా పక్కా అనే అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. కాంగ్రెస్ లో బిఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ ప్రముఖ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడిన మాటలపై కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా పెదవి విరుస్తున్నారు. ఎదో ఆయన తన ఉనికిని చాటుకోడానికే మాట్లాడినట్టు ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో రావడం కొసమెరుపు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.