24.4 C
Munich
Sunday, July 26, 2026

sikandar : సికందర్ సినిమా ఆ వయసు వాళ్ళే చూడాలంటూ సెన్సార్ సర్టిఫికెట్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

sikandar : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ప్రముఖ నటి రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘సికందర్’. ఈ సినిమా ఇప్పటికే కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30న అభిమానుల ముందుకు రాబోతోంది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. సికందర్ సినిమాపైననే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఇటీవలనే సికందర్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారులు కూడా సినిమాలోని ఏ ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించక పోవడం విశేషం. సెన్సార్ ప్రక్రియ కూడా మార్చి 21న పూర్తయ్యింది. థియేటర్లలో సినిమా ట్రైలర్ మూడు నిమిషాల 38 సెకన్లు ఉంటుంది. సినిమా విడిది మాత్రం రెండున్నర గంటలు ఉంటుంది.

సికందర్ సినిమాకు సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ అందజేశారు. ఈ సినిమాను13 ఏళ్ల, నుంచి ఆ పై వయసు ఉన్నవారు మాత్రమే చూడాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు చూడరాదు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ మిత్రుడు సాజిద్ నదియావాలా నిర్మించడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.