24.4 C
Munich
Sunday, July 26, 2026

Temple : ఆ ఆలయం ఆదాయం అంతా పేదలకే పంపిణీ చేస్తారు. ఎక్కడో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Temple : సాధారణంగా దేవాలయంకు వచ్చే హుండీ ఆదాయం అంతా కూడా ఆలయం అభివృద్ధికే కేటాయిస్తారు. హుండీ రూపంలో వచ్చిన ప్రతి రూపాయి దేవస్థానం అభివృద్ధికే చెందుతుంది. కానీ ఈ దేవాలయానికి వచ్చిన హుండీ ఆదాయం అంతా కూడా పేదలకే పంపిణి చేస్తారు ఆలయం కమిటీ సభ్యులు. ఆ ఆలయం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా చెమ్మలస్సేరి పట్టణంలో అళిక్కలి భగవతి దేవాలయం. ఈ దేవాలయానికి ప్రతి నెల హుండీ రూపంలో ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ హుండీ ఆదాయాన్ని పేదలకే ప్రతినెల పంపిణి చేస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. అర్హులైన 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసుకొని ప్రతి నెల ఒక్కో విద్యార్థికి ఉపకార వేతనంగా వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు.

అదే విధంగా అర్హులైన 200 మంది వృద్దులకు ప్రతినెల రెండువేల రూపాయలను ఫించన్ రూపంలో అందజేస్తున్నారు. దీర్ఘకాలిక వైద్యం పొందే వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఆలయానికి ఉన్నటువంటి ఐదెకరాల పొలం ద్వారా వచ్చే కౌలు సొమ్మును కూడా అర్హులైన పేదలకే పంచుతున్నారు. ఈ విదంగా అమ్మవారు తన పరిధిలో ఉన్నటువంటి పేదలకు సహాయం అందిస్తూ దీవెనలు కూడా పంచడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.