17.5 C
Munich
Tuesday, July 28, 2026

Singareni : అపరిష్కృత సమస్యల పరిష్కరానికి యాజమాన్యం అంగీకారం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ లో కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణం
సొంతింటి పథకం అమలుకు అంగీకారం
11 రకాల అలవెన్స్ లు పెంచుటకు ఒప్పందం
AITUC రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

Singareni : హైదరాబాద్ లో శుక్రవారం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తో గుర్తింపు కార్మిక సంఘం AITUCతో జరిగిన 38 వ స్ట్రక్చర్ సమావేశంలో పలు అపరిష్కృత సమస్యలను పరిష్కరించడానికి ఒప్పందం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. ఈ సందర్బంగా సీతారామయ్య మాట్లాడుతూ ఒప్పందం జరిగిన అంశాలను వివరించారు.

1. పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ ఇవ్వడం వలన కంపెనీకి సంవత్సరానికి 91 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. అయినప్పటికీ దీనిపై యాజమాన్యం ఇన్ ప్రిన్సిపుల్ కు అంగీకరించారు. దీనిపై కమిటీ వేయడం జరిగింది.
2. సొంత ఇంటి పథకం అమలు పరచుటకు అంగీకారం కుదిరింది. ఈ పథకం విధివిధానాలు రూపొందించడానికి కమిటీలో నిర్ణయం తీసుకుంటారు.
3. హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. హైదరాబాదులో ఉండే రిటైడ్ కార్మికులకు సింగరేణి భవన్లో మందులు ఇవ్వడానికి అంగీకరించారు. ఎలాంటి నిబంధనలు లేకుండానే రిటైడ్ కార్మికులు సింగరేణి ఆసుపత్రుల్లో చేరడానికి ఒప్పందం జరిగింది.

4. అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో కార్మికులకు లాకర్స్, కబోర్డ్స్, ఆఫీస్ లో ఫర్నిచర్స్ ఇచ్చుటకు అంగీకారం కుదిరింది.
5. సెక్యూరిటీ, హాస్పిటల్స్ సిబ్బంది ఎలక్ట్రిషన్, ఫిట్టర్స్ అన్ని రకాల మజ్దూర్ల డిసిగ్నేషన్స్ ను మార్చుటకు అంగీకరించారు. బదిలీ వర్కర్ బదులు జనరల్ అసిస్టెంట్ ట్రైనీగా ఇస్తారు.
6. డిస్మిస్ అయిన కార్మికులకు 5 సంవత్సరాలలో ఏదైనా ఒక సంవత్సరంలో 100 మాస్టర్లు ఉంటే వారికి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది..

7. JMO,JTO,JAO లకు ఏ గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉన్నవారికి E -1 గ్రేడ్ కు ఎలిజిబులిటీ ఇచ్చుటకు అంగీకారం కుదిరింది.
8. మారుపేర్లపై పనిచేసిన వారి పిల్లలకు మరియు డేట్ అఫ్ బర్త్ మార్పు కొరకు సర్టిఫికెట్స్ పెట్టిన వారికి మరియు విజిలెన్స్ కేసులు యాజమాన్యం మరియు గుర్తింపు సంఘంతో కమిటీ వేసి పరిష్కరించుటకు అంగీకరించారు.
9. 11 రకాల అలవెన్స్లు పెంచుటకు యాజమాన్యం అంగీకరించింది.
10. డిస్మిస్ అయిన JMET లందరిని వెంటనే విధుల్లోకి తీసుకుంటారు.

11. ఈపీ ఆపరేటర్లకు మిషనరీ గ్రేడ్ ప్రకారం D TO C, C TO B ఇచ్చుటకు ఒప్పందం కుదిరింది.
12. సొంత ఇల్లు కట్టుకున్న వారికి క్వాటర్ వెరీఫికేషన్ సర్టిఫికెట్ ఇచ్చుటకు అధికారులు అంగీకరించారు.
13. మైనింగ్ స్టాప్ తో పాటు ట్రేడ్స్ మెన్స్ లకు కూడా మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇచ్చుటకు అంగీకరించారు.
14. గత డైరెక్టర్ పా సమావేశంలో అంగీకరించిన N-1 తో పాటు అన్ని అంశాలకు చైర్మన్ ఆమోదం వేశారు. వీటిని అమలు చేయడానికి ఆదేశాలు సైతం జారీచేశారు.

ఈ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కునంనేని సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కే సారయ్య, కే వీరభద్రయ్య, వై వి రావు, ముష్కే సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, అక్బర్ ఆలీ, వై రామ్ గోపాల్ పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.