18.5 C
Munich
Monday, July 27, 2026

Taabu : ఆ గొడవలతోనే టాబు పెళ్లి ఆలస్యం అయ్యింది.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Taabu : తెలుగు చిత్ర పరిశ్రమలో టాబు హీరోయిన్ కు బోలెడంత అభిమానులు ఉన్నారు. ఆమె నటనకు తిరుగులేదు. సుమారు నలభయ్ ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటిగా కొనసాగుతోంది. తెలుగుతో పాటు హింది, తమిళం భాషల్లో కూడా నటించి మెప్పించింది.

యాబై ఏళ్ళు దాటినా ఆ తెలుగు పరిశ్రమ ముద్దుగుమ్మ టాబు నేటికీ ఒంటరిగానే ఉంటోంది. 50 ఏళ్ల వయసులో కూడా తన అందానికి ఏమి తక్కువ అంటోంది. తెలుగులో నటించిన సినిమాలు తక్కువే. కానీ అభిమానులు మాత్రం ఎందరో ఉన్నారు. ఇటీవలనే అల వైకుంఠ పురంలో సినిమాలో నటించింది. ఈ వయసులోనూ ఆమె హాట్ గా నటించి మెప్పించింది.

ఇటీవల ఆమె సరదాగా మాట్లాడుతూ తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. తన పెళ్లి ఆలస్యం కావడానికి గొడవలే ప్రధాన కారణమంది. ఆ హీరో చేసిన గొడవలకే తనని పెళ్లి చేసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదని వివరించింది. అజయ్ దేవగన్, టాబు తో పాటు టాబు సోదరుడు సమీర్ మంచి స్నేహితులు. టాబు చిన్న వయసులో ఉన్నప్పుడే ఎవరైనా ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించడం, లేదంటే ఏమైనా అనడం జరిగితే వెంటనే సోదరుడు సమీర్, అజర్ దేవగన్ కలిసి కొట్టేవారు. దాంతో అబ్బాయిలు చూడటానికి కూడా బయపడే వారని, ఆ గొడవలు చూసిన వారు బయపడటంతోనే ఇప్పటి వరకు కూడా పెళ్లి సంబంధాలు రాలేదని తెలిసిందని టాబు సరదాగా మాట్లాడుతూ తన మనసులోని మాట చెప్పేసింది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.