20.5 C
Munich
Monday, July 27, 2026

Game change : గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ చేంజ్ అయ్యేనా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Game change : దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ సినిమా నిర్మించారు. ఇందులో హీరోగా రామ్ చరణ్ నటించింది అందరికి తెలిసిందే. కీలక పాత్రలో తెలుగు అమ్మాయి అంజలి నటించింది. ఇటీవలనే రామ్ చరణ్ అభిమానులు విజయవాడలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ కట్ అవుట్ పై హెలికాఫ్టర్ తో పూలవర్షం కురిపించి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు తో పాటు చిత్ర బృందం, అభిమానులు హాజరైనారు.

ఇటీవలనే పుష్ప-2 విడుదల అయ్యింది. సినిమా విజయవంతం అయ్యింది. కానీ ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దింతో హీరో అల్లు అర్జున్ నుంచి మొదలు కొని పెట్టుబడిదారులు, చిత్ర బృందంతో పాటు అభిమానులు నిరాశకు లోనైనారు. సంబరాలు చేసుకోకుండానే ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సినిమా విడుదలకు ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో ప్రభుత్వం స్పదించింది. టికెట్ ధరలు పెంచేది లేదని, ప్రీమియర్ షోలు కూడా ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో విడుదల అయ్యే తెలుగు సినిమాల పెట్టుబడిదారుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనది.

తాజాగా రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాత గేమ్ చెంజర్ సినిమాను భారీ పెట్టుబడితో నిర్మించారు. ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు టికెట్ ధరలు, ప్రీమియర్ షో లు ఉండవు. కాబట్టి పెట్టిన పెట్టుబడి వచ్చేనా అనే అనుమానాలు సైతం చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి. పెట్టిన పెట్టుబడితో అదనపు ఆదాయం వస్తేనే రామ్ చరణ్ అదృష్టం పండినట్టే. లేదంటే ఆయన సాధించిన రికార్డులకు బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలూ సైతం తెలుగు చిత్ర పరిశ్రమలో వ్యక్తం కావడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.