22 C
Munich
Monday, July 27, 2026

CM : 26న సీఎం తో సినీ ప్రముఖుల బేటీ ….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CM : పుష్ప-2 సినిమా చూడటానికి సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడం….. అక్కడే తొక్కిసలాట జరగటం…. రేవతి అనే మహిళ చనిపోవడం…ఆమె కుమారుడుశ్రీ తేజ కోమాలోకి వెళ్లడం తెలిసిందే. అయితే ఈ విషయం అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ పరిశ్రమలో సైతం తుఫాన్ రేపింది. ప్రతిపక్షాల్లో సైతం అల్లు అర్జున్ విషయాన్నీ కొందరు సమర్ధించడం, మరికొందరు విమర్శించడం జరిగింది. అల్లు అర్జున్ ఒక రోజు జైలు కు వెళ్లడం, వెంటనే బెయిల్ రావడం కూడా జరిగింది.

అల్లు అర్జున్ ను ఈ నెల 24న పోలీస్ శాఖ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారించడం కూడా జరిగింది. FDC చైర్మన్ దిల్ రాజు కూడా ఈ విషయంలో స్పందించారు. అల్లు అరవింద్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా శ్రీ తేజను పరామర్శించారు. అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి శ్రీ తేజ ను పరామర్శించక పోవడాన్ని తప్పు పట్టారు. వెంటనే సినీ, రాజకీయ ప్రముఖుల్లో కదలిక వచ్చింది.

డిసెంబర్ 26న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ ప్రముఖులు కలవనున్నారు. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతోపాటు, దర్శక నిర్మాతలు సమావేశంకు రానున్నారని ఎఫ్‏డీసీ ఛైర్మన్ దిల్ రాజ్ తెలిపారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ కూడా రానున్నారు. వీరితో పాటు ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు సీనియర్ మంత్రులు కూడా సమావేశానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.