23.9 C
Munich
Monday, July 27, 2026

Central Govt : 17,727 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Central Govt : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024,నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించిన నోటిఫికేషన్

అప్పర్ డివిజన్ క్లర్క్,ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ నార్కోటిస్ట్, టాక్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్) పోస్టులను వివిధ కేంద్ర సంస్థల్లో గ్రూప్-B, గ్రూప్-C లో ఖాళీగా ఉన్న విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఏదేని డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. కొన్ని పోస్టులకు మాత్రం డిగ్రీ తో పాటు అదనపు అర్హతలు తప్పనిసరి. అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. జూలై 24 వరకు దరఖాస్తులు చేసుకోడానికి అవకాశం ఉంది. SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో రాత పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేటాయించిన కేంద్రాల్లో నిర్వహిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17,727, సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI), సబ్ ఇన్‌స్పెక్టర్ (NIA), ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ), పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్), ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్), ఇన్‌స్పెక్టర్, ఇన్కమ్ టాక్స్ అసిస్టెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ఇన్‌స్పెక్టర్ (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్), ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC), డివిజనల్ అకౌంటెంట్ (కాగ్), రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC), సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (NCB), సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (NCB), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్), పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.