NIGAMA MEDIA (P) LTD
18.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, August 28, 2026

బీబీపేటలో రాఖీ సందడి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

రాఖీ పౌర్ణమి సందర్భంగా బీబీపేట మండలానికి చుట్టుపక్కల గ్రామాలైన కోనాపూర్, ఉప్పర్‌పల్లి, ఇస్సానగర్, తుజాల్‌పూర్, షేర్, బీబీపేట, మల్కాపూర్, యాడారం, జనగామ తదితర గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా బీబీపేట మండల నాయకుడు కొరివి నరసింహులు రాఖీలు విక్రయించే వ్యాపారులకు స్థలాలు కేటాయిస్తూ సహకరించారు. మండలానికి వచ్చే ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. వ్యాపారులు బాగా వ్యాపారం చేసుకోవాలని ఆకాంక్షించారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని నరసింహులు ఆకాంక్షించారు. కులమత భేదాలు, కోపతాపాలను పక్కనపెట్టి అందరూ ఐకమత్యంతో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.