22 C
Munich
Monday, July 27, 2026

50 lakhs Loan : నిరుద్యోగులకు కేంద్రం రు : 50 లక్షల లోన్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

50 lakhs Loan : కొందరికి ప్రభుత్వ ఉద్యోగం చేసి స్థిరపడాలనే లక్ష్యంతో ఉంటారు. మరికొందరు తాను సంపాదిస్తూ మరికొందరికి ఉపాధి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇంకొందరు వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. వ్యాపారంలో రాణించాలనే వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాపారంలో స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్నవారికి కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. రు . 50 లక్షల రుణాన్ని వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్నవారికోసం వడ్డీ లేకుండా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా ఈ ఋణం మంజూరు చేస్తారు.

కొత్తగా చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమలను స్థాపించే వారికోసం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. మధ్య తరహా ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం కూడా ఈ ఋణం అందుబాటులో ఉంది. పాత పరిశ్రమలతోపాటు, పాత పరిశ్రమల అభివృద్ధికి మాత్రం ఈ పథకం పనిచేయదు. ఏదయినా పరిశ్రమ నెగిటివ్ జాబితాలో ఉంటె కూడా పథకానికి అనర్హత కిందనే వస్తుంది. ఈ పథకం 2026 వరకు అమలులో ఉంటుంది. నిరుద్యోగుల ఆసక్తి కనబడితే పథకాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది.

35 శాతం సబ్సిడీతో అర్హులైన ఎస్సి, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్స్, అంగ వైకల్యం ఉన్నవారు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తే వర్తిస్తుంది. వీరంతా కూడా ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమను స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ అమలవుతుంది. జనరల్ క్యాటగిరి నిరుద్యోగులకు పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం సబ్సిడీ అమలవుతుంది.

18 ఏళ్ళు నిండిన వారంతా కూడా ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఉండాలి. స్వయం సహాయక బృందాల సభ్యులు ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి ఒక్కరే అర్హులు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు ఫారం తోపాటు, మరిన్ని వివరాల కోసం https://kvicoline.gov.in/ క్లిక్ చేసి PMEGP పోర్టర్ లోకి వెళ్ళాలి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.