20.5 C
Munich
Monday, July 27, 2026

Heart Attack : గుండెపోటు వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువ ….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Heart Attack : పురుషులు, స్త్రీలు వివిధ రకాల జబ్బులను ఎదుర్కొంటున్నారు. బీపీ, షుగర్ తో సతమత మవుతున్నవారు ఎందరో ఉన్నారు. కిడ్నీ వ్యాధి తో ఇబ్బంది పడేవారున్నారు. ఇటీవల కాలంలో గుండె పోటు తో మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోందని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటు స్త్రీ, పురుషులకు ఇద్దరికీ వస్తుంది. కానీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసు కుందాం. స్త్రీల కంటే పురుషులకే ఎక్కువగా ఈ గుండె పోటు వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. కానీ ఇది నిజం కాదు. గుండెపోటు రావడానికి మహిళలతోపాటు, పురుషుల్లో కూడా వివిధ కారణాలతో వస్తున్నాయి. ఒకే కారణంతో వస్తాయి అనేది కూడా వాస్తవం కాదని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్త్రీలల్లో గుండెపోటు రావడానికి కారణాలు ….

55 ఏళ్ల వయస్సు దాటిన స్త్రీలల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు కానీ, స్ట్రోక్ వచ్చిన సందర్భాలు ఉంటె వీళ్లకు కూడా వస్తుంది. అధిక రక్త పోటుతో పాటు, షుగర్ ఉన్నారిలో కూడా గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్కూ, ధూమ పాణం, అధిక శరీర బరువు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన తో కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండ వ్యాయామం చేయాలి. గర్భనిరోధక మాత్రలు వాడే వారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకొని పాటించాలి.

పురుషుల్లో గుండెపోటు రావడానికి కారణాలు ….

పురుషులు క్రమం తప్పకుండ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. 45 ఏళ్ల వయసు దాటిన వారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికయినా ఇదివరకే గుండె పోటు వచ్చి ఉంటె, వాళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బీపీ, షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అధిక శరీర బరువు కూడా మంచిది కాదు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన ఉన్నవారు కూడా డాక్టర్ ను సంప్రదించాలి. వేగంగా పనులు చేయడం మానుకోవాలి. అకస్మాత్తుగా పరుగెత్తడం కూడా మంచిది కాదు.

గుండె జబ్బు లక్షణాలు ఇవే …..

ఛాతి భాగంలో నొప్పి క్రమంగా పెరగడం, బరువుగా ఉండటం, ఛాతిని కదిలించే పరిస్థితి లేకపోవడం కనబడితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. శ్వాశ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా, వాంతులు కావడం, ఆగకుండా చెమటలు రావడం, తలతిప్పడం, కళ్ళు తిరిగి పడిపోవడం, చెవి కింది భాగం నుంచి ఎడమ చేయి నుంచి మొదలుకొని , చేయి కింది భాగం వరకు నొప్పి వంటి లక్షణాలు ఖచ్చితంగా గుండె జబ్బు ఉన్నట్టుగా భావించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సంబంధిత డాక్టర్ వద్దకు వెళ్ళాలి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.