22 C
Munich
Monday, July 27, 2026

BSF Recruitment: ఇంటర్ తో ఉద్యోగం .. రూ.92,300 వరకు జీతం..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BSF Recruitment: భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది. అస్సాం రైఫిల్స్ ,సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో వివిధ ఉద్యోగాను భర్తీ చేయడానికి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 1526 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in లో రిజిస్టర్ చేసుకోవదానికి సంస్థ అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ జూలై ఎనిమిది, 2024 .

అధికారికంగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం CAPFలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, అస్సాం రైఫిల్స్‌లో వారెంట్ ఆఫీసర్, హవల్దార్ ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నారు. ఈ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 1526 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆగష్టు ఒకటో తేదీ, 2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు నిండి ఉండాలి. 25 ఏళ్ళు దాటిన వారు దరఖాస్తు చేసుకోడానికి అనర్హులు. రిజర్వేషన్ అవకాశం ఉన్నవారిలో ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభర్ధులకు మూడు సంవత్సరాలు, మాజీ సైనికులకు కూడా మూడు ఏళ్ల సడలింపు ఉంది.

రిజర్వేషన్ ఉన్నవారితో పాటు, మహిళలకు, మాజీ సైనికులకు దరఖాస్తు చేసుకోడానికి ఫీజు లేదు. సర్వీస్ ఛార్జ్ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మిగతావారు అప్లికేషన్ కు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నియామకానికి ముందు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష హింది, ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ASI , వారెంట్ ఆఫీసర్ ఉద్యోగస్తుల వేతనం రూ. 29,200 నుంచి రూ. 92,300 వరకు ఉంటుంది. హెడ్ ​​కానిస్టేబుల్, హవల్దార్ ఉద్యోగస్తుల వేతనం రూ.25,500 నుంచి రూ. 81,100 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో ప్రకటించారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.