NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Finger Problem : అక్కడ వేలుపెడితే…. మీ మెదడుకు ముప్పే ….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Finger Problem : మన ఆరోగ్యం మనచేతిలో.. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. తలలో దురద వచ్చిందంటే వేలుపెట్టి రుద్దుతాం. చెవిలో కాస్త ఇబ్బంది ఏర్పడితే వేలుపెట్టి బాధ తగ్గించుకుంటాం. ముక్కులో ఏదయినా ఇబ్బంది వస్తే వేలుపెట్టి రుద్దుతాం. శరీర భాగాల్లో తాత్కాలికంగా వచ్చే దురదలను చేతి వేళ్ళతో మర్దన చేసుకొని ఉపశమనం పొందడం సహజం. శరీరంలోని ప్రతి భాగం మరొక భాగానికి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ప్రతి అవయవాన్ని ఆరోగ్యాంగా కాపాడుకోవాల్సిందే.

కొందరికి అవకాశం దొరికితే చాలు ముక్కులో వేలుపెట్టి తిప్పుతారు. ఎదో ఒక కారణంతో ముక్కులో వేలుపెట్టందే మనసున పట్టదు. వేలుపెట్టి రుద్దుతారు. కొందరికి అలవాటు కూడా ఉంటది. అలవాటు ఉన్నా, లేకపోయినా ముక్కులో వేలుపెట్టి రుద్దేస్తారు. ఆ అలవాటు ఉన్నవాళ్లు మానివేస్తే వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముక్కులో వేలుపెట్టుకునే అలవాటు చాల ప్రమాదకరం అని కూడా వైద్యులు చెబుతున్నారు. అల్జీమర్స్, డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలినట్టు వైద్యులు చెబుతున్నారు.

ముక్కులో వేలుపెట్టి తిప్పడం వలన లేదా అలవాటు ప్రకారం వేలుపెట్టుకున్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరల్‌, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ , పాథోజెన్ల లాంటివి ముక్కు ద్వారా మెదడులోకి చేరుకుంటాయి. ఆ విదంగా మెదడుకు చేరడం వలన మన ఆలోచనలు, జ్ఞాపకశక్తి , మాట్లాడే భాష పైన ప్రభావం చూపే అవకాశాల తోపాటు మెదడు సంబంధాలను నియంత్రించి అల్జీమర్స్ కి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

మనిషి మెదడులో అమిలాయిడ్, ప్రోటీన్లు అధికంగా పోగయి మెదడు కణాలు చనిపోవడానికి పనిచేస్తాయి. మతిమరుపు కు కారణం అవుతాయి. న్యుమోనియా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ముక్కులో వేలుపెట్టుకునే అలవాటు ఉన్నవారు మానుకుంటే చాల మంచిదని, ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకున్న వారవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.