20.5 C
Munich
Monday, July 27, 2026

Iam Krishnaveni : నా పేరు హేమ కాదు.. కృష్ణవేణి… ఏమిచేసుకుంటారో చేసుకోండి….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Iam Krishnaveni : Iam Krishnaveni : బెంగుళూర్ రేవ్ పార్టీ రోజుకో మలుపు తిరుగుతోంది. రేవ్ పార్టీ లో నేను లేను. ఇంట్లో ఉన్నాను. కిచెన్ లో ఉన్నాను. బిర్యాని వండుతున్నాను. నా ఫామ్ హౌస్ లో ఉన్న. అంటూ కొందరు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటులు సుద్దపూస మాటలు పలికారు. రేవ్ పార్టీలో దొరికిన వారి రక్త నమూనాలు, సంఘటన స్థలంలో లభించిన వీడియో, సీసీ కెమెరా వీడియో లను పరిశీలించారు బెంగుళూర్ పోలీస్ లు.

అయినా అక్కడ ఉన్నది నేను కాదు. నాలాగా ఉన్నారు. నేను అక్కడికి రానేలేదు. అంటూ పోలీస్ శాఖ సేకరించిన ఆధారాలను కూడా తప్పుపడుతున్నారు కొందరు. ఇంకా చెప్పాలంటే నా అసలు పేరు వేరే. మీరు చెప్పే పేరు నాది కనే కాదు అంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు కొందరు నటులు. రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉన్నారని బెంగుళూర్ పోలీసులు ప్రకటించారు. ఆమె ఉన్న ఫోటోను కూడా విడుదల చేశారు. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నటి హేమ కథ అడ్డం తిరిగింది. నేను హైదరాబాద్ లో ఉన్నానని, కిచెన్ లో బిర్యానీ మండుతున్న అంటూ వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

95 మంది రక్త నమూనాలను పోలీసులు సేకరించారు. నటి హేమ తోపాటు ఆశీరాయ్, వాసు కు డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో తేలింది. హేమతోపాటు మరికొందరికి కూడా పోలీసులు నోటీసులు పంపించారు. నటి హేమ కెమెరా ముందు నటించడమే కాదు. నిజజీవితంలో పోలీస్ శాఖ ఎదుట కూడా బ్రహ్మాండంగానే నటించి మెప్పించడానికి ప్రయత్నించింది.

అయితే పోలీసులకు దొరికినప్పుడు హేమ తన అసలు పేరు కృష్ణ వేణి గ చెప్పుకొంది. కృష్ణవేణి పేరుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ లో వార్త చూసిన తరువాతనే ఆమెను హేమ గా గుర్తించారు పోలీసులు. ఇప్పడు డ్రగ్స్ కేసులో హేమ రక్త నమూనా పాజిటివ్ గా నమోదయినది. బ్లడ్ రిపోర్ట్ పై స్పదింస్తూ నటి హేమ ఏమి చేస్తారో చేసుకోండి. టైం దొరికినప్పుడు నేను మాట్లాడుతా అంటూ చెప్పుకురావడం కొసమెరుపు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.