20.5 C
Munich
Monday, July 27, 2026

Tea benefits : చాయ్ తాగితే ప్రయోజనం ఎంత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Tea benefits : గడ్డి గుడిసెలో ఉన్న పేదవాళ్ళు చాయ్ తాగుతారు. విలాసవంతమైన భవనాల్లో ఉన్న ధనవంతులు చాయ్ తాగుతారు. కుదిరితే కప్పు చాయ్ తాగుదాం. వీలైతే నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందాం అంటూ సరదాగా ఏ హోటల్ లోనో నలుగురు కలిసి చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. కాలేజీ కుర్రాళ్ళు నలుగురు కలిస్తే కాలేజీ ముందున్న గుడిసె హోటల్ కు వెళ్లి టు బై ఫోర్ చాయ్ అంటారు. లేదంటే త్రి బై ఫైవ్ చాయ్ అంటారు. ఇలా వాళ్ళ స్తోమత ఆధారంగా చాయ్ ఆర్డర్ ఇస్తూ తమ స్నేహాన్ని ఆనందంగా గడుపుతారు. స్నేహానికి చాయ్ ఇచ్చే అనుబంధం అలాంటిది.

ఉదయం లేచిందంటే ఓ కప్పు చాయ్ తాగితే శరీరంలో ఉత్సహం వస్తుంది. అప్పుడే మిగతా పనులు చేసుకోవడం మొదలు పెడతారు ఆ ఇంటి యజమానురాలు. ఆమె చాయ్ తాగుతూ,ఇంటిలోని వారందరికీ ఒక్కొక్కరికి అడిగిన వెంటనే చాయ్ అందిస్తుంది. ఇలా చాయ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. పాటలు అంతకూ సరిపోవు. చాయ్ పొడి అదే చాపత్తలో ఉన్న పలు కారకాలు మెదడును ఎంతో ఉత్తేజ పరుస్తాయి. మెదడు హుషారుగా పనిచేస్తుంది. పనిపై శ్రద్ద పెరుగుతుంది. చిన్న, చిన్న పనులు చేసుకునే వాళ్ళు సైతం చాయ్ తో పొట్ట నింపుకొని ఎంతో హుషారుగా పనులు చేసుకుంటారు. శాస్త్రవేత్తలు సైతం మెదడు మరింత హుషారుగా పనిచేయడానికి మధ్య, మధ్యలో చాయ్ తాగుతూ పరిశోధనల్లో మునిగిపోతారు. దాంతో వారికి అలసట అనేది తెలియదు.

మొదటిసారి అంతర్జాతీయ టీ దినోత్సవం ఉద్యమం 2005 లో ప్రారంభమైనది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని తేయాకు తోటల పెంపకం దారులు, తేయాకు కూలీలు ఆ ఉద్యమాన్ని సమర్థిస్తూ అండగా నిలిచారు. అమ్మకానికి గిట్టుబాటు ధరలు, వేతనాలు, ఉత్పత్తి, పెట్టుబడులు వంటి సమస్యలపై చేసిన ఉద్యమం ఫలించింది మే 21 న. అప్పటి నుంచి మే 21 న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పలు దేశాల్లో.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.