20.5 C
Munich
Monday, July 27, 2026

Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమాకు మారిన దర్శకుడు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Hari Hara Veeramallu: ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే ఆయన అభిమానుల్లో చెప్పలేనంత ఆనందం. ఒక విదంగా చెప్పాలంటే ఆయనకు ఉన్నంత క్రేజ్ మరో నటుడికి లేదనేది స్పష్టం. రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు సంఖ్య తగ్గింది. రాజకీయాల్లో అడుగుపెట్టకుండా కేవలం సినిమాలకె నిరంతరం అందుబాటులో ఉంటె ఆయన క్రేజీ చెప్పలేము. వరుసగా ఆయన సినిమాలు తీసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ధాటిని తట్టుకోవడం చిత్ర పరిశ్రమలో ఎవరికీ కూడా సాధ్యం కాదు.

మూడు ఏళ్ల కిందట ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా కోసం అయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా కూడా సగం మాత్రమే పూర్తయ్యింది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సగం పూర్తి చేసిన అయన ఆ సినిమాకు దర్శకత్వం చేయలేనంటూ చెప్పేశారు. దీనితో ఇప్పుడు కొత్త దర్శకుడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు పెట్టుబడిదారులు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇంత ఆలస్యంగా ఏ సినిమా నిర్మాణం జరుగలేదు. హరిహర వీరమల్లు సినిమా ఒక్కటే మూడేళ్లు దాటింది. ఇప్పుడు క్రిష్ పక్కకు తప్పుకున్నారు. కొత్త దర్శకుడి కోసం వేట మొదలయినది. నిర్మాత కొత్త దర్శకుడి కోసం చూస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ స్థాయికి తగిన దర్శకుడు ఎవరు వస్తారా అనే అనుమానాలు చిత్ర పరిశ్రమలో తలెత్తుతున్నాయి. ఎట్టకేలకు మిగితా సగం సినిమాను పూర్తి చేయడానికి పవన్ కల్యాణే ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చిత్రం యూనిట్ బృందం అంటోంది.

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.