Sri Sailam : శ్రీ శైలం పుణ్య క్షేత్రంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. మొక్కులు చెల్లించుకోవడంతో పాటు, పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి డ్యాం కూడా చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు, సమీప రాష్ట్రాల భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. గత రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆలయం అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 15 తేదీ నుంచి 18 తేదీ వరకు శ్రీ శైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. సర్వ దర్శనం క్యూలైన్ లో ఉన్న భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనం కల్పిస్తున్నట్టుగా ఈఓ ఎం శ్రీనివాస్ రావు ప్రకటించారు.