Home » Target CM Jagan : సీఎం జగన్ ను టార్గెట్ చేసిన సినీపరిశ్రమ

Target CM Jagan : సీఎం జగన్ ను టార్గెట్ చేసిన సినీపరిశ్రమ

Target CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెండోసారి కూడా అధికారం తనదనే ధీమాలో ఉన్నారు. విశాఖ పట్టణం వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని కుండబద్దలు కొట్టినట్టు ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పేశారు జగన్. కానీ తన గెలుపు మీద ఎంత నమ్మకం ఉంటె జగన్ ప్రమాణ స్వీకారం గురించి అలా మాట్లాడుతారు అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. సీఎం జగన్ ను ఓడించడానికి ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అదేవిదంగా రాజకీయంగా గిట్టుబాటు కాకపోవడంతో చెల్లులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొంది. షర్మిల కూడా అన్నను ఓడించడానికి తనదయిన శైలిలో ప్రచారం చేస్తోంది.

జగన్ ను ఓడించడానికి ఒకవైపు కూటము వెంటపడింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కసిగానే ఉంది. రెండు వర్గాలతో సతమత మవుతున్న జగన్ కి సినీ పరిశ్రమ కూడా తలనొప్పిగా తయారైనది. జగన్ పరిపాలనలో సినీ పరిశ్రమ సతమతమయ్యిందినే ఆరోపణలు ఉన్నాయి. మానసికంగా, ఆర్థికంగా, బౌతికంగా ఎన్నో ఇబ్బందులు పడింది సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు ఆ పరిశ్రమ కూడా ఏకమయి జగన్ వెంటపడిందనే అభిప్రాయాలు పరిశ్రమలో వ్యక్తం కావడం విశేషం. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకరించక పోవడంతో పరిశ్రమ వెనుకబడిపోయిందని పలువురు ఆవేదనతో ఉన్నారు. అదేవిదంగా పరిశ్రమ అపరిష్కృత సమస్యలను కూడా వైసీపీ ప్రభుత్వం పరిష్కరించలేదనే అపవాదును కూడా జగన్ మూటగట్టుకున్నారు.

ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు తో ప్రజలకు సేవలందిస్తున్న ప్రముఖ నటుడు చిరంజీవి సీఎం జగన్ ను కలవడానికి వెళితే అవమానాన్ని ఎదుర్కోవడం తప్పలేదు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ నటుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక పాట రాయగా ఆ విషయంలో త్రివిక్రంను వైసీపీ నేతలు ఫోన్ చేసి బండ బూతులు తిట్టడం జరిగింది. ప్రతి రోజు వైసీపీ కార్యకర్తలు వరుసగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి తిట్టడం పనిగా పెట్టుకున్నారు. హీరో నాగార్జున ఖమ్మం లో వ్యవసాయ భూమి ఐదు వందల ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ భూమిని తనకు అమ్మేవరకు జగన్ మనసులు వెంటపడి వేధించారు. చివరకు నాగార్జున అమ్ముకోలేక తప్పలేదు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ప్రతిభతో ప్రపంచం మెచ్చే విదంగా ఎదిగారు. అటువంటి దర్శకుడిని కూడా ఒక సమావేశంలో అవమానానికి గురిచేశారు సీఎం జగన్. ఇలా ఎంతో మంది కళాకారులను అవమానానికి గురిచేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం జరిగింది. కేవలం సీఎం జగన్ ఒక్కడే చేసాడని కాదు, అతనితో పాటు ప్రభుత్వం అండ ఉన్న వైసీపీ నేతలు కూడా సినీపరిశ్రమను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఏపీ లో ఎన్నో ఉన్నాయని పరిశ్రమ వర్గాల సమాచారం.

2014 లో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల్లో నిలబడలేదు. 2019 ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ జనసేనకు ఎదురుగాలి తగిలింది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీరంగమే అయినప్పటికీ పరిశ్రమ అండగా నిలబడలేదు. తాజాగా జరుగబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీ తో జత కట్టి కూటమి తయారైనది. దీనితో సినీ పరిశ్రమలో కూడా ఆశలు పెరిగాయి. ఇప్పడు జగన్ ఓడించడానికి కూటమికి సినీపరిశ్రమ తన మద్దతును బాహాటంగానే ప్రకటించడం విశేషం. అంతే కాదు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన అభ్యర్థులను కూడా గెలిపించుకోడానికి ప్రచారంలోకి సినీ పరిశ్రమ దిగడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *