Abhisek Sharma cricketer : IPL 2024 సన్ రైజర్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ మ్యాచ్ లలో అదరగొడుతున్నారు. బ్యాటింగ్ లో తన సత్తా చాటుతున్నాడు. పరుగుల వర్షం మైదానంలో కురిపిస్తున్నాడు. సిక్స్ లతో చుక్కలను చూపుతున్నాడు. ఫోర్లతో బౌండరీలను అదరగొడుతున్నారు. ఇదంతా చూసిన క్రికెట్ అభిమానులకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ గుర్తుకు వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను మరిపిస్తున్నాడని కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన మనసులోని మాట చెప్పకనే చెప్పేశాడు.
మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. తన అభిమానులను బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. డౌన్ స్వింగ్ చేసే తీరు చక్కగా ఉంటుంది. క్రీజ్ లో ఉన్నంతసేపు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నే మరిపిస్తున్నాడు. ఇక మిగిలింది టీం ఇండియా ఒక్కటే పిలవాల్సిన సమయం మిగిలి ఉంది. అది కూడా అతి దగ్గరలోనే ఉందంటున్నారు అభిమానులు. టీం ఇండియాలో అడే రోజులు ఎంతో దూరం లేవంటున్నారు క్రికెట్ అభిమానులు
క్రీజ్ లో ఉన్న సమయంలో పవర్ ప్లే లో ఆడుతూ స్పిన్నర్లనూ, పేసర్లనూ తనదయిన శైలిలో ఆడుకుంటున్నాడు. తన హిట్టింగ్ తో ప్రతిభ ఉన్న, సీనియర్ క్రీడాకారుడిగా దూసుకుపోతున్నాడు. టి – 20 ప్రపంచ కప్ ముగిసిన తరువాత అభిషేక్ శర్మ ఇండియా టీం లో చేరడం ఖాయమని పలువురు క్రికెట్ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా కొనసాగుతున్న ఐపీఎల్ పోటీల్లో అభిషేక్ శర్మ ప్రత్యర్థులకు చుక్కలు చూపుతూ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్ లను ఆడి 401 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. 401 పరుగుల్లో 35 సిక్స్ లు , 30 ఫ్లోర్ లు ఉండటం విశేషం.