Home » Kalabanda : కలబంద పెట్టుబడి 50 వేలు …. 10లక్షల ఆదాయం

Kalabanda : కలబంద పెట్టుబడి 50 వేలు …. 10లక్షల ఆదాయం

Kalabanda : కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయ రంగాన్ని ఎంచుకుంటున్నారు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి వేతనం కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అంతే కాదు పది మందికి ఉపాధి కూడా ఇస్తున్నారు. వ్యవసాయ రంగంలో కలబంద పంట పై పెట్టుబడి పెడితే రైతు లక్షాదికారి కావడం ఖాయమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.

కలబంద పంటను సాగు చేయడానికి అన్ని రకాల నెలలు అనుకూలమే. నీరు ఎక్కువగా ఉండని నెలలు చాలా అనుకూలం. అధిక చలి ఉన్న నెలలు సరిపోవు. మొక్క నాటిన పది నెలల్లోనే మొదటి దశ కోతకు వస్తుంది. ప్రతి నాలుగు నెలలకోసారి ఆకులు తీసుకోవచ్చు. ఐదేళ్ల పాటు పంట దిగుబడి వస్తుంది. కలబంద మొక్క ఆకులు 10సెం.మీ వెడల్పు, 1.5 నుండి 2.0సెం.మీ మందం, 60 సెం.మీ పొడవు ఉంటాయి. ఎండ వేడిమి తక్కువగా ఉన్నపుడు మాత్రమే ఆకులు కత్తిరించాలి. ఎక్కువగా పెరిగిన ఆకులను ఏడాదికి 3సార్లు కోసుకోవచ్చు. ఆకులతోపాటు వాటి పిలకలను అమ్ముకొని ఆదాయం పొందవచ్చు.

కలబంద సాగుకు ఎకరానికి రూ : 50 వేల పెట్టుబడి సరిపోతుంది. మొదటి ఏడాది 25 టన్నుల దిగుబడి వస్తుంది. మరుసటి ఏడాది 30 టన్నుల దిగుబడి వస్తుంది. మొదటి పంట తరువాత ఎలాంటి ఖర్చులు ఉండవు. పిలకలు నాటిన నాటి నుంచి మొదటి పంట వచ్చే వరకు మాత్రమే ఎకరానికి 50 వేలు ఖర్చు అవుతుంది. టన్ను కలబంద ధర మార్కెట్ లో 15 వేల నుంచి 25 వేల వరకు ఉంది. ఒక ఎకరంన్నర సాగు చేస్తే రైతుకు 40 నుంచి 50 టన్నుల దిగుబడి వస్తుంది. రైతుకు సుమారుగా 6 నుంచి పది లక్షల మేరకు ఆదాయం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *