Home » Silver : దీపావళి నాటికి కిలో వెండి ధర ఎంత అవుతుందంటే !

Silver : దీపావళి నాటికి కిలో వెండి ధర ఎంత అవుతుందంటే !

Silver : బంగారంతో కలిసి వెండి ధర కూడా పోటీపడి పరుగులు పెడుతోంది. తులం బంగారం ధర రూ : లక్షకు అటు, ఇటుగా ఉంటోంది. తాజాగా ఆర్థిక నిపుణులు వెండి ధర పెరుగుదల పై దృష్టి సారించారు. వచ్చే దీపావళి నాటికి కిలో ధర ఎంత వరకు పెరుగవచేదానిపై ఒక అంచనాకు వచ్చారు ఆర్థిక నిపుణులు.

రోజు, రోజుకు మార్కెట్ లో వెండికి డిమాండ్ పెరగడంతోనే ధర పెరుగుతోంది. అవసరానికి తగ్గట్టుగా మార్కెట్ కు వెండి సరఫరా కూడా కావడం లేదు. ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఎలక్ట్రిక్ వాహనాలు, 5G టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి పారిశ్రామిక ఉత్పత్తులల్లో వెండిని 50 నుంచి 55 శాతం వరకు వాడుతారు. ఈ కారణంగా కూడా వెండి ధర పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో వెండి కిలో ధర రూ : 1,08,775 ఉంది. ఆర్థిక నిపుణుల అంచనాల మేరకు వచ్చే దీపావళి నాటికి కిలో వెండి ధర వెండి ధర రూ. 1 లక్ష 25 వేల నుంచి రూ. 1 లక్ష 30 వేలకు పెరగడానికి అవకాశం ఉందంటున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *