YCP Fail in AP : 2019 లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మేధావుల సలహాలు తీసుకున్నారు. సూచనలు స్వీకరించారు. ప్రైవేట్ సంస్థలతో సర్వే చేయించుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరిని పార్టీ అభ్యర్థిగా పోటీలో గెలుస్తారనే విషయంపై కూడా సర్వే చేయించారు. నియోజకవర్గాల వారీగా గట్టి అభ్యర్థి కోసం సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నాయకుల, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నారు. అందరి మాటలకు విలువ ఇచ్చి, వారి అమూల్యమైన సలహాలు, స్వీకరించి పోటీచేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు.
ఎన్నికల సర్వే నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు ఆసక్తికరంగా మాట్లాడారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగడానికి ముందు తాను జగన్ విజయం కోసం అనేక సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. మేనిఫెస్టో తయారీలో తన పాత్ర కూడా ఉందన్నారు. 2019 వైసీపీ మేనిఫెస్టో లో నవరత్నాలను తానే సూచించానని చెప్పేశారు. కానీ వాటిని సీఎం అయ్యాక జగన్ మోహన్ రెడ్డి అమలుచేయలేదన్నారు. అవి అమలు చేసి ఉంటె జగన్ కు ఈ ఎన్నికల్లో కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. నవరత్నాల పథకాలను ఎందుకు ఆయన అమలుచేయలేదో అర్థం కావడం లేదని ప్రశాంత్ కోశోర్ అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచాక సీఎం జగన్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదని ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆరోపించారు.
ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు లేరన్నారు. అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు జరగలేదన్నారు. పథకాలను అమలు చేయడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు ప్రశాంత్ కిషోర్. ప్రజలకు పథకాలు అందనపుడు వాళ్ళు వైసీపీ నాయకులను ఎందుకు అభిమానిస్తారని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి చెందడం ఖాయమని పద్దెనిమిది నెలల క్రితమే జగన్ కు చెప్పానని ప్రశాంత్ కిషోర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా జగన్ నా మాటలను పట్టించుకోలేదన్నారు. పరిపాలనలో పద్దతులను, ఎమ్మెల్యేల పనితీరును మార్చుకుంటాడనే ఉద్దేశ్యంతో ఏడాదిన్నర కిందట చెప్పిన వినలేదన్నారు. ఈ తాజా ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు.