Minister : తెలంగాణ రాష్ట్ర మంత్రి తన తోటి ఎమ్మెల్యేలతో కలిసి కొత్తగూడెంలోని పలు కాలనీల్లో పర్యటించారు. అభివృద్ధి పనుల గురించి సంబంధిత ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో కలిసి పర్యటించారు. సమీక్ష కూడా నిర్వహించారు. అలసిపోయిన మంత్రి కాస్త సేదతీరడానికి కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ కు వెళ్లారు. ఇంకేముంది వసతి గృహం అంతా కంపు వాసన రావడంతో అయన ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. సేదతీరుదామని వస్తే… ఈ దుర్గంధం ఏమిటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ మంత్రి ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇల్లందు, అశ్వారావు పేట, పినపాక ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించిన అనంతరం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే మంత్రి గెస్ట్ హౌస్ భాద్యతలు నిర్వహిస్తున్న అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలను సింగరేణి ఉన్నతాధికారులకు జారీ చేశారు. దింతో సంబంధిత సీనియర్ అసిస్టెంట్ ను పది రోజుల పాటు సస్పెండ్ చేసినట్టుగా తెల్సింది. ఏడు రోజుల్లో వివరణ కూడా ఇవ్వాలని మంత్రి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.